![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1111 లో....నా బావని పట్టుకొని రిషి సర్ అంటున్నావేంటి? ఇక్కడ నుండి వెళ్ళిపోమని వసుధారతో సరోజ అనగానే.. వెళ్లిపోతాను పదిహేను రోజుల్లో నువ్వు బావ అంటున్న రంగానే నా రిషి సర్ అని నిరూపించి తన నోటితోనే రిషి సర్ అని చెప్పించి, తనని ఇక్కడ నుండి తీసుకొని వెళ్తానని వసుధార ఛాలెంజ్ చేస్తుంది. ఆమ్మో ఇదేంటి ఇలా అంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని సరోజ అనుకుంటుంది. ఆ తర్వాత ఏంజిల్ అన్న మాటలు గుర్తుకి చేసుకుని శైలేంద్ర తనని తాను బెల్ట్ తో కొట్టుకుంటాడు. అపుడే ధరణి వచ్చి ఆపుతుంది. ఏం చేస్తున్నారని ధరణి అడుగుతుంది. ఎప్పుడు ఎండీ చైర్ కి ఎవరో ఒకరు అడ్డువస్తున్నారు.. వసుధార ఇప్పుడు లేదు అయినా ఎవరో ఒకరు వస్తున్నారని శైలేంద్ర అంటాడు. మీకెప్పటికి అది దక్కదు అని ధరణి అంటుంది.
మరొకవైపు ఏంజిల్, మను ఇద్దరు ఇంట్లో మాట్లాడుకుంటారు. ఏంటి నీకెప్పుడు ఇదే లోకమా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావ్.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని ఏంజిల్ అడుగుతుంది. ప్రేమించాను.. మా అమ్మని ప్రేమించానని మను అంటాడు. ముందు మీ నాన్నని ప్రేమించు అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత వసుధార, రంగా భోజనం చేస్తుంటారు. అప్పుడే సరోజ క్యారేజ్ తీసుకొని వస్తుంది. చేపల పులుసు తెచ్చానని సరోజ అంటుంది. లేదు సర్ చారుతో తింటారని రంగాకి చారు పోస్తుంది వసుధార. అది తిని నానమ్మ ఈ చారు నువ్వు చెయ్యలేదు కదా అని రంగా అడుగుతాడు. లేదు ఆ అమ్మాయి వద్దంటే వంట చేసిందని పెద్దావిడ చెప్తుంది. ఏం బాలేదని రంగా అనగానే వసుధార బాధపడుతుంది. అప్పుడు సరోజ చేపల పులుసు వడ్డీస్తుంది. ఆ తర్వాత సారీ సర్ అని వసుధార అంటుంది. ఎందుకు మేడమ్ అని రంగా అంటాడు. మీకు నచ్చని విధంగా వంట చేసాను కదా.. అందుకే అని వసుధార అంటుంది. మీరు వంట చేశారని కోపం అంతే అని రంగా అంటాడు.
ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలేజీ కి ఎవరు ఎండీగా ఉండాలో చెప్పండి అని మినిస్టర్ అడుగుతాడు. ఒకరు మను అంటారు.. మరొకరు శైలేంద్ర అంటారు. దాంతో మీరు ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోండి.. లేదంటే ఈ కాలేజీని మా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని మినిస్టర్ అనగానే.. ఇది మా కాలేజీ అలా అంటారు ఏంటని శైలేంద్ర అంటాడు. మా కుటుంబం వాళ్లే ఉండాలి కాబట్టి నేనుంటానని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |